'ఆ వజ్రాలు సీఎం ఇంట్లో..'

'ఆ వజ్రాలు సీఎం ఇంట్లో..'

తిరుమల తిరుపతి దేవస్థానంలోని విలువైన ఆభరణాలను హైదరాబాద్‌, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  నివాసాలకు తరలించారంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఇవాళ విశాఖలో ఆయన మాట్లాడుతూ 12 గంటల్లోగా చంద్రబాబు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయపడతాయని, ఒకవేళ బయటపడకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 12 గంటలు దాటితే  ఆభరణాలు విదేశాలకు తరలిపోతాయని అన్నారు. 


బాబును దేవుడే శిక్షిస్తాడు: అంబటి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ధర్మపోరాటంలో ధర్మం లేదు పోరాటం లేదు‌ అని వైసీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన గుంటూరులో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చలేదని ఇప్పుడు చెబుతున్న చంద్రబాబు.. మోడీ సభల్లో ఆయన మాటలకు చప్పట్లు కొట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆక్కర్లేదు.. ప్యాకేజీ చాలు అని చంద్రబాబు అన్నారని అంబటి గుర్తుచేశారు. దైవాన్నే దోచుకునే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి తప్పులను దైవం లెక్కిస్తున్నదని ఆయన వివరించారు. రమణ దీక్ఞితులను వైసీపీకి అంటగట్టి, వైసీపీని బీజేపీకి అంటగట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అంబటి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తిరుమల వెంకన్నే చంద్రబాబును శిక్షిస్తారని అంబటి అన్నారు.