బరువును వేగంగా తగ్గించే ఆ 13

బరువును వేగంగా తగ్గించే ఆ 13

గతంలో కన్నా ఇప్పటివాళ్లలో ఆరోగ్యం మీద అవగాహన పెరిగినా.. వేగంగా పూర్తి చేయాల్సిన రోజువారీ పనుల వల్ల శరీరం మీద పూర్తి స్థాయి శ్రద్ధ చూపించలేకపోతున్నారు. ఫలితంగా చాలా మంది ఒబేసిటీని అదుపు చేయలేకపోతున్నారు. బరువు తగ్గడానికి ఎన్నెన్నో కసరత్తులు చేయడం, రకరకాల జ్యూసులు తీసుకోవడం, స్ట్రెస్ మేనేజ్ మెంట్ టెక్నిక్స్ పాటించడం వంటివి చేస్తున్నా.. అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతున్నారు. అయితే దీనిమీద జరిగిన పలు పరిశోధనల ఫలితంగా విటమిన్స్, మినరల్సే బాడీ వెయిట్ ను సమతుల్యంగా ఉంచుతాయని, చక్కనైన ఆరోగ్యానికి అవే ఉత్తమమైన పరిష్కారాలని తేల్చి చెబుతున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు.. విటమిన్స్, మినరల్స్ కాంబినేషన్స్ గురించి కూడా వివరిస్తున్నారు. అవేంటో మీరూ చూడండి. 

అయోడిన్:
శరీర బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషించేది థైరాయిడ్ గ్రంథి. దీని పనితీరు మందగిస్తే బరువు విపరీతంగా పెరిగిపోవడం ఖాయం. అయితే చాలావరకు ఐరన్ లోపం వల్లే థైరాయిడ్ గ్లాండ్ పనితీరు బద్ధకిస్తుందని తేలింది. ఇప్పుడైతే అయోడిన్ తో కూడిన ఉప్పు మార్కెట్లో అన్ని బ్రాండ్లలో కూడా అందుబాటులో ఉంది. కానీ సంప్రదాయమైన సముద్ర ఉప్పే మంచిదన్న ఉద్దేశంతో చాలామంది సముద్ర ఉప్పు వైపు మొగ్గు చూపుతున్నారు. అందువల్ల నిపుణులు కొన్ని రకాల మల్టీ విటమిన్స్ ను సూచిస్తున్నారు. వాటిలో ఐరన్ కావాల్సిన పాళ్లలో ఉంటుందని, కాబట్టి ఆ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ను డాక్టర్ సూచించిన మేరకు పరిమిత స్థాయిలో వాడితే ఐరన్ లోపాన్ని అరికట్టి శరీర బరువును సమతూకంలో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. 


విటమిన్ డి:
విటమిన్ డి లోపం ఓవర్ వెయిట్ కు అతిపెద్ద కారణంగా డాక్టర్లు చెబుతున్నారు. విటమిన్ డి తగ్గిపోవడం వల్ల శరీరం షుగర్ ను ఎనర్జీగా మార్చడానికి బదులు ఫ్యాట్ గా మారుస్తుందని గుర్తించారు. బాడీ యాక్టివిటీ సరిగా ఉండనివారిలో, మితిమీరి బరువు ఉన్నవారిలో విటమిన్ డి లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటివారికి విటమిన్ డి సప్లిమెంట్స్ తో పాటు క్యాల్షియం ట్యాబ్లెట్స్ ఇవ్వడంతో పొట్టలో పేరుకుపోయిన కొవ్వు చాలావరకు కరిగిపోయిందని నిర్ధారించారు. విటమిన్ డి సప్లిమెంట్స్ లో డి2, డి3 ఉన్నాయి. 

ఐరన్:
ప్రపంచమంతా ఇప్పుడు ఎదుర్కొంటున్న హెల్త్ సవాల్ ఐరన్ లోపం, ఓవర్ వెయిట్. ఈ రెంటికీ అవినాభావ సంబంధం ఉందని నిపుణులు అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. పురుషుల కన్నా మహిళలు ఐరన్ లోపంతో చాలా బాధపడుతున్నారు. నెలవారీ మెన్సెస్ కారణంగా కోల్పోతున్న ఐరన్ ను భర్తీ చేయకపోవడంతో ఓవర్ వెయిట్ మహిళల్లోనే ఎక్కువవుతోంది. విటమిన్ సి తో కలిపి ఐరన్ ట్యాబ్లెట్స్ ను క్రమపద్ధతిలో వాడటం వల్ల బాడిలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అందువల్ల చురుకుదనం పుడుతుంది. ఎక్సర్ సైజ్ చేయాలన్న ఉత్సాహం వస్తుంది. శారీరక శ్రమతో వెయిట్ లాస్ అయ్యే చాన్సుంది. పురుషులకు రోజూ 8ఎంజీ సరిపోతే, మహిళలకు మాత్రం 18ఎంజీ డోస్ కావాలంటున్నారు నిపుణులు. 

మెగ్నీషియం:
ఖనిజ లవణాల్లో ఐరన్ తరువాత చాలా ముఖ్యమైంది మెగ్నీషియం. మెగ్నీషియం మానవ కండరాలు రిలాక్సయ్యేలా చేస్తుంది. దీంతో శరీరం ప్రశాంతంగా అలజడి లేకుండా ఉండి సుఖమైన నిద్రకు కారణమవుతుంది. అదే మెగ్నీషియం లోపించిన మనిషి సౌండ్ స్లీప్ కు దూరమవుతాడు. ఒకవేళ నిద్ర పట్టినా మధ్యమధ్యలో మెలకువ వచ్చి సతమతమవుతాడు. అలా నిద్రకు దూరమైన మనిషిలో షుగర్ లెవల్స్ పెరిగి ఓవర్ వెయిట్ కు దారి తీస్తుంది. పురుషులకు 400ఎంజీ డోసు, మహిళలకు 310-320ఎంజీ ని డాక్టర్లు ప్రిఫర్ చేస్తున్నారు. 

కార్నటైన్: 
ఇదో రకమైన అమైనో యాసిడ్. ఇది శరీరంలోని అన్ని కణాలకు ఫ్యాటీ యాసిడ్స్ నిరంతరాయంగా ప్రయాణించేలా చేస్తుంది. ఈ ప్రక్రియ వల్లే ఫ్యాట్ మండి శక్తి జనిస్తుంది. అలా శక్తి విడుదలైనప్పుడే బరువు అదుపులో ఉంటుంది. కాబట్టి బరువు పెరగడానికి కార్నటైన్ లోపం కూడా ఓ కారణంగా తేల్చారు. రోజూ 500ఎంజీ-1000ఎంజీ వరకు కార్నటైన్ తీసుకున్నట్టయితే ఎలాంటి ఎక్సర్ సైజులూ లేకుండానే బరువు తగ్గొచ్చంటున్నారు వైద్య నిపుణులు.

బీటా అలనైన్:
సాధారణ సూత్రీకరణ ప్రకారం తిండి కలిగితే కండ కలిగినట్లే... ఎక్కువ వర్కవుట్స్ చేస్తే ఎక్కువ బరువు తగ్గే అవకాశం ఉంది. అందుకు పనికొచ్చేది బీటా అలనైన్. ఇది తీసుకోవడం ద్వారా కార్నోసిన్ అనే మాలిక్యూల్ ను జనరేట్ చేస్తుంది. ఈ మాలిక్యూల్ శరీర కండరాలు, బ్రెయిన్ సెల్స్ మీద ప్రభావం చూపుతుంది. ఎక్కువ సేపు శ్రమించేలా సహకరిస్తుంది. దీన్ని వాడినవారు 2 నుంచి 4 రెట్లు వర్కవుట్స్ చేసినట్లు రుజువైంది. సాధారణంగా 4-6 గ్రాముల బీటా అలనైన్ ఒకరోజుకు సరిపోతుందని వైద్యులు నిర్ధారించారు.


ఎల్-సిట్రులిన్:
బీటా అలనైన్ లాగే ఎల్-సిట్రులిన్ కూడా పని చేస్తుంది. హైలెవల్ ఎక్సర్ సైజులు చేయడానికి ముందుగా దీన్ని తీసుకోవడం ద్వారా ఎక్కువ ఫలితాలుంటాయని చెబుతున్నారు. రోజుకు 5-7 గ్రాముల ఎల్-సిట్రులిన్ ను వైద్యులు ప్రిఫర్ చేస్తున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు డాక్టర్ ను సంప్రదించాకే దీన్ని ట్రై చేయాలని హెచ్చరిస్తున్నారు. 

జిమ్నీమా సిల్విస్టర్:
జిమ్నీమా సిల్విస్టర్ లేదా సిమ్నీమా సిల్విస్టర్ పేరుతో పిలిచే ఈ ఔషధం.. డయాబెటిక్ పేషెంట్లకు బాగా పనిచేస్తుంది. భారతీయ ఆయుర్వేదంలో దీన్ని పొడపత్రి అంటారు. షుగర్ కు మంచి విరుగుడు. దీని ఆకుల నుంచి వచ్చే రసం రుచిని తగ్గిస్తుందంటారు. కాబట్టి దీన్ని తీసుకున్న తరువాత ఆహారం రుచి కోల్పోయి తక్కువ తినేలా చేస్తుందన్నమాట. ఆహారానికి ఓ గంట ముందు జిమ్నీమా సిల్విస్టర్ క్యాప్సూల్ తీసుకున్నవారు... అది తీసుకోనివారికంటే బాగా తక్కువ తిన్నారని పరిశోధనల్లో రుజువైంది. కాబట్టి బరువు తగ్గడానికి దీన్ని చక్కని పరిష్కారంగా భావిస్తున్నారు. ఇది పౌడర్ రూపంలో, టీ రూపంలో కూడా లభిస్తుంది.

గ్లూకోమన్నన్:
ఎలిఫెంట్ యామ్ గా చెప్పుకునే దీన్నే మనం కందగడ్డగా పిలుస్తాం. అద్భుతమైన ఫైబర్ కంటెంట్ దీని సొంతం. కాసింత తిన్నా పొట్ట నిండుగా అయిపోయి ఆకలి వేయదు. ఎక్కువసేపు ఏమీ తినకుండా ఉండగలిగే శక్తి వస్తుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఫ్యాట్ కు మంచి పరిష్కారంగా వైద్యులు సూచిస్తున్నారు. దీని వాడకంతో ఐదు వారాల్లో 8-10 పౌండ్స్ బరువు తగ్గినట్లు గుర్తించారు. బాడీలో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఇది మేలు చేయడం వల్ల శరీరానికి సత్తువనిస్తుంది. వెయిట్ లాస్ కోసం రోజుకో గ్రాము చొప్పున తీసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. 

థియోబ్రోమైన్: 
బరువు తగ్గడానికి రుచికరమైన చాక్లెట్లయితే బాగుండు అనుకునేవారికి ఇది బాగా కలిసొచ్చే ఔషధం. చాకొలేట్, కకావో బీన్స్ మిశ్రమంతో తయారైన ఈ ట్యాబ్లెట్స్ లో 1200ఎంజీ థియోబ్రోమైన్ ఉంటుందట. ఇందులోని జెల్ షుగర్ ప్రాసెసింగ్ హార్మోన్ ఇన్సులిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇది డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో ఉపకరిస్తుంది. 400ఎంజీ క్యాప్సూల్స్ ని రోజుకు 2 చొప్పున వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

కెఫీన్:
కాఫీలో కావాల్సినంత కెఫీన్ ఉంటుంది. ఓ కప్పు కాఫీ (100 గ్రాములు) ఎడ్రినలిన్ ను సరైన మోతాదులో రిలీజ్ చేస్తుంది. బాడీలో నిల్వ ఉన్న ఫ్యాట్ ను కరిగించడంలో బాగా ఉపకరిస్తుంది. దీన్ని తీసుకున్న తరువాత కొన్ని గంటల వరకు కొవ్వును కరిగించడంలో నిమగ్నమై ఉంటుందని వైద్యులు తేల్చారు. మొత్తానికి కొవ్వు తగ్గాలనుకునేవారు ఓ కప్పు ఎక్కువ తీసుకున్నా పర్లేదంటున్నారు. పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ దీన్ని వాడకుండా ఉంటే మేలు. 

మచా టీ:
ఇది సాధారణ గ్రీన్ టీ కన్నా ఎంతో బాగా పని చేస్తుందట. టీ బ్యాగ్ కు బదులు టీ తోటల్లో దొరికే ఆకులనే నేరుగా వేడినీళ్లలో వేసి తీసుకుంటే అదే మచా టీ. ఒబేసిటీ ఉన్నవారికి గ్రీన్ టీ కన్నా ఇది అద్భుతంగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. 

ఫైబర్:
జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేనివారు, ఎంతో తింటే తప్ప సంతృప్తి పొందలేనివారు ఓవర్ వెయిట్ కు గురవుతారు. అందుకు మంచి పరిష్కారం ఫైబర్ ఒక్కటే. దీన్ని రెగ్యులర్ ఆహారంలో చేర్చడం ద్వారా తినే ఫుడ్ క్వాంటిటీ తగ్గుతుంది. బర్నయ్యే పర్సంటేజ్ పెరుగుతుంది. కాబట్టి వెయిట్ సులభంగా లాసవుతుంది. ముడి ధాన్యాలు, పళ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.