అంతర్జాతీయ జట్టులో జీరోలు అనుకున్నవారే ఐపీఎల్ లో హీరోలు అవుతున్నారు...

అంతర్జాతీయ జట్టులో జీరోలు అనుకున్నవారే ఐపీఎల్ లో హీరోలు అవుతున్నారు...

ఆటగాళ్లు, అభిమానులు ఎంతగానో ఎదురు చుసిన ఐపీఎల్ 2020 ప్రారంభమై 4 మ్యాచ్ లు పూర్తయాయి. అయితే ఇందులో జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ పోటీపడ్డాయి. అందులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. ఆ తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన చెన్నై జట్టు మొదట 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన అంబటి రాయుడు 48 బంతుల్లో బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ తర్వాత ఈ ఏడాది ఐపీఎల్ నుండి తప్పుకున్న చెన్నై జట్టు బౌలర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ... గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ జట్టులో ఆడటానికి కూడా తనకు అర్హత ఉందని రాయుడు నిరూపించుకున్నాడు అని తెలిపాడు.  గతేడాది జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ భారత జట్టులో చోటు కోసం ఎంతగానో ఎదురు చూసిన అంబటి రాయుడికి సెలక్టర్లు మొండిచేయి చూపిన సంగతి తెలిసిందే. అప్పటికి మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ రాయుడిని పక్కనపెట్టి అతడి స్థానంలో విజయ్‌ శంకర్‌కు అవకాశమివ్వడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. అప్పుడు వారు దానికి చెప్పిన కారణం శంకర్‌ మంచి బాట్స్మెన్, బౌలర్ అలాగే ఫీల్డర్ అని చెప్పారు. దానికి రాయుడు నేను ఈ ప్రపంచ కప్ చూడటానికి 3-డి గ్లాసెస్ తీసుకుంటాను అని పంచ్ వేసాడు. 

ఇది నేరుగా వరల్డ్‌కప్‌ లో అవకాశం అందుకున్న విజయ్‌ శంకర్‌ అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. దాంతో అప్పుడు అభిమానులు బీసీసీఐని తీవ్రంగా విమర్శించాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో రాయుడు మొదటి మ్యాచ్ లో అదరగొడితే శంకర్‌ మాత్రం మళ్ళీ నిరాశే మిగిల్చాడు. ఆర్సీబీ తో సన్ రైజర్స్ ఆడిన మ్యాచ్ లో ఓవర్ మధ్య బౌలర్ షాన్ మార్ష్ గాయం కారణంగా తప్పుకోగా చివరి బంతి వేసిన శంకర్‌ మొత్తం 10 పరుగులు ఇచ్చాడు. ఆ ఒక్క బంతికి రెండు నో బాల్స్ వేసాడు. దాంతో అభిమానులు అప్పటి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కె ప్రసాద్‌ ను 3-డి గ్లాసెస్ తీసుకొని ఐపీఎల్ మ్యాచ్ లు చూడమని ట్రోల్ చేస్తునారు. 

ఇక ఐపీఎల్ లో ఎంత అద్భుతంగా రాణించిన అంతర్జాతీయ జట్టులో అవకాశం దక్కని మరో ఆటగాడు సంజు సామ్సన్. ఇప్పటివరకు 94 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన సామ్సన్ మొత్తం 2283 పరుగులు చేసాడు. అందులో రెండు సెంచరీలు 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కానీ ఈ ఆటగాడు ఇప్పటివరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది నాలుగు మ్యాచ్ లలో మాత్రమే. అందులో 2015 లో రెండు మ్యాచ్ లు 2020 లో మరో రెండు మ్యాచ్ లు. ఐపీఎల్ లో సామ్సన్ ఎంత రాణించిన బీసీసీఐ మాత్రం తరచు మరో మరోఆటగాడు రిషబ్ పంత్ కే అవకాశాలు ఇస్తుంది. అయితే గత ఏడాది ప్రపంచ కప్ కు కూడా ఎంపికైన పంత్ కూడా అభిమానులందరినీ నిరాశ పరిచిన విషయం తెలిసిందే. పంత్ ఎంత విఫలం అయిన అతనికి ఛాన్స్ కు ఇస్తున్న బీసీసీఐ అధికారులను ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించగా..? యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి అని చెప్తుంది. కానీ ఈ మాటలు సామ్సన్ విషయంలో మర్చిపోతుంది. 

ఇక ఈ ఏడాది ప్రారంభమైన ఐపీఎల్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించే పంత్ మొదటి మ్యాచ్ లో 29 బంతుల్లో 31 పరుగులు చేసాడు. కానీ సంజు సామ్సన్ నిన్న చెన్నై తో జరిగిన మ్యాచ్ లో 32 బంతుల్లో 74 పరుగులు చేసాడు. అంటే అంతర్జాతీయ జట్టులో జీరోలు అనుకున్న రాయుడు, సామ్సన్ వంటివారే ఐపీఎల్ లో హీరోలు అవుతున్నారు. అయితే నిన్న సామ్సన్ హిట్టింగ్ పై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ... ''సంజు సామ్సన్ ఉత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, ఉత్తమ యువ బ్యాట్స్మాన్, అయిన కూడా అతనికి భారత జట్టులోని పదకొండు మంది లో చోటు దొరకకపోవడం విడ్డూరంగా ఉంది'' అని తెలిపాడు. మరి ఐపీఎల్ వంటి 2020 ఫార్మాట్లో అద్భుతంగా ఆడుతున్న ఈ ఆటగాళ్లను కనీసం వచ్చే ఏడాది జరగనున్న టీ 20 ప్రపంచ కప్ జట్టులోకైనా ఎంపిక చేస్తారా... లేదా నేది చూడాలి.