సింగపూర్ నుంచి రావాలనుకుంటున్న వారు వివరాలను పంపించండి: మోహన్ బాబు

సింగపూర్ నుంచి రావాలనుకుంటున్న వారు వివరాలను పంపించండి: మోహన్ బాబు

లాక్ డౌన్ వేళ విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని సొంత దేశానికి రప్పించేందుకు కేంద్రం అనేక ఏర్పాట్లను చేస్తోంది. ఈ నేపత్యంలోనే  కేంద్ర ప్రభుత్వం వందే భారత్ పేరుతో ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా విదేశాల్లో ఉన్నవారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి రప్పిస్తారు. దీనిలో భాగంగానే సింగపూర్ నుండి ఇండియాకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసారు. అంతే కాకుండా సింగపూర్ ప్రభుత్వం కూడా తమ దేశంలో చిక్కుకుపోయిన వారిని వారి నివాస స్థలాలకు  చేర్చడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. అయితే విషయాన్నీ మోహన్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసాడు. వచ్చే వారం ఈ విమానం వస్తోందని ఆయన వెల్లడించారు. సింగపూర్ లో చిక్కుకుపోయిన వారు తిరిగి రావడానికి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మీరు కాని, మీ కుటుంబీకులు కాని ఈ విమానంలో రావాలనుకుంటే..అప్లై చేసుకోవాలని వివరాలు పొందుపర్చాడు.