వైసీపీలో చేరిన టీడీపీ నేత

వైసీపీలో చేరిన టీడీపీ నేత

టీడీపీ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే  తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న తోట త్రీమూర్తులు తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధి కోసమే వైసీపీలో చేరానని చెప్పారు. తోట త్రిమూర్తులతో పాటు భారీ సంఖ్యలో ఆయన అనుచరులు, కార్యకర్తలు అధికార పార్టీలో చేరారు. డీప్యూటీ సీఎం పిల్లి సుభాస్ చంద్రబోస్ తో పాటు తోట త్రిమూర్తులు  పై విజయం సాధించిన రామచంద్రపురం ఎమ్మెల్యే వేణు సహా పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు. రెండ్రోజుల క్రితం మార్టీ మారవద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబు జ్యోతుల నెహ్రూతో బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. తాను వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాననీ, ఈ విషయంలో వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. వైసీపీలోచేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ జిల్లా అభివృద్ధి కోసమే తాను వైసీపీలో చేరానని తెలిపారు. ఏపీ భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రజలు సమర్థుడైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఏపీ అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.