ఎగ్జిట్ పోల్ ఎఫెక్ట్: కమల్‌నాథ్ ప్రభుత్వానికి ముప్పు?
ఎగ్జిట్ పోల్ వెలువడిన కొన్ని గంటల్లోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని బీజేపీ ఆరోపించింది. వెంటనే రాష్ట్ర గవర్నర్ ఆనందిబిన్ పటేల్‌ను బీజేపీ ప్రతినిధి బృందం కలిసింది. విపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకుడు గోపాల్ భార్గవ్ నేతృత్వంలోని ఈ బృందం... వెంటనే అసెంబ్లీని ఏర్పాటు చేసి... కమల్‌నాథ్ ప్రభుత్వంపై బలపరీక్ష నిర్వహించాలని కోరింది. కమల్‌నాథ్ ప్రభుత్వానికి మెజారిటీ లేదని తెలిపింది. మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఉపసంహరిస్తామని బీఎస్పీ మాయావతి ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఎగ్జిట్ పోల్ వెలువడిన వెంటనే బీజేపీ అనుసరిస్తున్న ఈ వ్యూహం వెనుక కథేమిటో ఇంకా వెల్లడికాలేదు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)