జయలలిత మీద "ట్రిపుల్ ధమాకా"

జయలలిత మీద "ట్రిపుల్ ధమాకా"

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మీద ఏకకాలంలో 3 బయోపిక్ లు రాబోతున్నాయి. విబ్రి మీడియా ఆధ్వర్యంలో నిర్మాత విష్ణువర్ధన్ జయ మీద సినిమాకు ప్లాన్ చేశారు. వచ్చే ఫిబ్రవరి 24న జయ జయంతి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు అప్పుడే ప్రారంభమవడం విశేషం. 

ఇక శక్తి సినిమా పనుల్లో బిజీగా ఉన్న డైరెక్టర్ ప్రియదర్శిని.. జయ మీద మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. గత మే నెలలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఫిబ్రవరి 24న షూటింగ్ ప్రారంభమవుతుందని చెబుతున్నారు.

ప్రఖ్యాత నిర్మాత భారతీరాజా ఆధ్వర్యంలో మరో సినిమా రాబోతోంది. దానికి టైటిల్ ని "అమ్మ: పురచ్చితలైవి" గా ఖరారు చేశారు. సినిమాలో ఐశ్వర్యారాయ్, అనుష్కాశెట్టి లాంటి టాప్ హీరోయిన్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. భారతీరాజా వెర్షన్ కి డిసెంబర్లోనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. తమిళ్, తెలుగు, హిందీ వెర్షన్లలో ఈ మూడు బయోపిక్ లకు ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అమ్మ అభిమానులు సంతృప్తి చెందేలా ఈ సినిమాలు ఉంటాయని భావిస్తున్నారు.