స్మగ్లర్‌ పరారీ...కానిస్టేబుళ్లపై వేటు

స్మగ్లర్‌ పరారీ...కానిస్టేబుళ్లపై వేటు

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారించిన ముగ్గురి కానిస్టేబుళ్లపై వేటు పడింది. స్మగ్లర్‌ పరారీలో నిర్లక్ష్యంగా ఉన్న కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు విజయవాడ సీపీ ద్వారాకా తిరుమలరావు. కొద్ది రోజుల క్రితం గంజాయి సప్లయ్‌ చేస్తూ ఆరుగురు పోలీసులకు చిక్కారు. ఇందులో పడాల్‌ అనే కానిస్టేబుల్‌ గంజాయి స్మగ్లర్‌ అవతారమెత్తాడు. గంజాయి కేసులో ఏ1 నిందితుడు పడాలే. ఈ ఆరుగురికి రాజమండ్రి కోర్టు 15 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ నెల 19న ఆరుగురిని గన్నవరం నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలిస్తుండగా పడాల్‌ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. ఇదంతా పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్‌ పై వేటు వేశారు అధికారులు.