విందు భోజనం వికటించి ముగ్గురు మృతి

విందు భోజనం వికటించి ముగ్గురు మృతి

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గణపతిగూడలో విషాదం నెలకొంది. పెళ్లి విందు భోజనం వికటించి ముగ్గురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతులు కొడప ముత్తు (1) లక్ష్మణ్ (3) భీం బాయి (6) గా గుర్తించారు. బాధితులను స్థానికులు నార్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్నవారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.