బ్లాక్‌లో ఐపీఎల్‌ టికెట్ల విక్రయం..!

బ్లాక్‌లో ఐపీఎల్‌ టికెట్ల విక్రయం..!

హైదరాబాద్‌లో బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. వీరి దగ్గర నుంచి 16 టికెట్లు, రూ. 38 వేలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని మెట్రో రైల్  స్టేషన్ లో ఐపీఎల్ టికెట్స్ బుకింగ్ క్లర్క్స్ గా విధులు నిర్వహిస్తున్నవారిగా గుర్తించారు పోలీసులు. ఒక్కో టికెట్ రెండు వేల రూపాయలకు విక్రయిస్తున్న నిందితులు. ఆన్‌లైన్‌లో టికెట్లను బ్లాక్ చేసి అనంతరం అసెంబ్లీ మెట్రో స్టేషన్ బయట విక్రయిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌ఘా పట్టుకున్నారు పోలీసులు. గత కొద్దిరోజులుగా ఈ తతంగాన్ని అసెంబ్లీ మెట్రో రైల్ స్టేషన్‌లోని ఐపీఎల్ టికెట్స్ బుకింగ్ కౌంటర్ సిబ్బంది నడిపిస్తున్నట్టు గుర్తించారు.