టెస్ట్ ర్యాంకింగ్స్‌: టాప్‌ 5లో ముగ్గురు, టాప్‌ 10లో నలుగురు మనోళ్లే..

టెస్ట్ ర్యాంకింగ్స్‌: టాప్‌ 5లో ముగ్గురు, టాప్‌ 10లో నలుగురు మనోళ్లే..

ఫార్మాట్‌ ఏదైనా ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్స్‌ దూసుకుపోతున్నారు. లేటెస్ట్‌గా ఐసీసీ ప్రకటించిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో రెండు విభాగాల్లో కలిపి చూస్తే టాప్‌ 10లో మనొళ్లే ఆరుగురు ఉండడం విశేషం.. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ టాప్‌-10లో నాలుగు స్థానాలు దక్కించుకున్నారు. హిస్టారికల్‌ పింక్‌ టెస్ట్‌లో సత్తా చాటిన కోహ్లీ, పుజారా, రహానే, మయాంక్‌ టాప్‌ 10లో చోటు దక్కించుకున్నారు. 928 పాయింట్లతో కోహ్లీ సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నాడు. 931 పాయింట్లతో ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌స్మీత్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచాడు. స్మిత్‌కి , కోహ్లీకి కేవలం మూడు పాయింట్లు మాత్రమే తేడా ఉంది. విరాట్‌తో పాటు పింక్‌ టెస్ట్‌లో హాఫ్‌ సెంచరీలతో మెరిసిన పుజారా, రహానే వరుసగా మూడు, నాలుగు స్ధానాలు దక్కించుకున్నారు. ఓపెనింగ్ టెస్ట్‌లో డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్న మయాంక్‌ 10 స్ధానంతో సరిపెట్టుకున్నాడు. 

అటు బౌలింగ్‌లోనూ.. టీమిండియా బౌలర్లు టాప్‌ -10లో మెరిశారు. బంగ్లా సిరీస్‌కు అందుబాటులో లేని బుమ్రా ఐదో స్ధానంతో సరిపెట్టుకుంటే.. అశ్విన్‌ 10 వ స్ధానంలో నిలిచాడు. ఇక, టీమ్స్‌ విషయానికోస్తే టీమిండియా టాప్‌ ప్లేస్‌లో నిలవగా.. కివీస్‌ టీమ్‌ రెండో స్థానంలో నిలిచింది. మొత్తానికి టీమిండియా ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ర్యాంకుల పని పట్టారు.