బోటు ప్రమాదం...యజమాని సహా ముగ్గురు అరెస్ట్

బోటు ప్రమాదం...యజమాని సహా ముగ్గురు అరెస్ట్

దేవీపట్నం పడవ ప్రమాద ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. బోటు ఓనర్‌తో పాటు ఎల్లా ప్రభావతి, అచ్యుతరమణిని అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎడమపక్కగా వెళ్లాల్సిన బోటును గోదావరి మధ్యలో నడిపారని, డ్రైవర్‌కు అనుభవం లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ. బోటులో ముగ్గురు పిల్లలు, 64 మంది పెద్దలు ఉన్నారని తెలిపారు. పోలీసులు తనిఖీ చేసినప్పుడు అందరూ లైఫ్‌ జాకెట్లు వేసుకున్నారని, చెకప్‌ తర్వాత లైఫ్‌జాకెట్లు తీసేయోచ్చని సిబ్బంది చెప్పారని అన్నారు ఎస్పీ. రంపచోడవరం ఏఎస్పీ వకుళ్ జిందాల్ బోటు యజమాని వెంకటరమణను మీడియా ముందు ప్రవేశపెట్టారు.  బోటును గుర్తించినా, దాన్ని బయటికి తీసుకురావడంలో నిపుణులు సైతం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 26 మందిని కచ్చులూరు గ్రామస్థులు కాపాడారని వారికి అభినందనలు తెలుపుతున్నట్లు ఏఎస్పీ జిందాల్ తెలిపారు. గల్లంతైన వారికోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.