పామును కర్రీ చేసుకుతిన్న ముగ్గురి అరెస్ట్.!

పామును కర్రీ చేసుకుతిన్న ముగ్గురి అరెస్ట్.!

ఇంట్లోకి వచ్చిన పామును వండుకుని తిన్నారు. దాంతో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేయారు. ఈ ఘటన ఎక్కడో చైనా లేదా జపాన్లో జరగలేదండీ. మనదేశంలోనే తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... సేలం జిల్లా మెట్టూరు తంగామముని పట్టణానికి చెందిన శివకుమార్ ఇంట్లోకి పాము రావడంతో అతడి స్నేహితులు హుస్సేన్,సురేష్ ల సహాయంతో దాన్ని పట్టుకున్నాడు.అనంతరం ముగ్గురూ కలిసి ఆ పామును ముక్కలుగా చేసి వండుకుని తిన్నారు. అంతే కాకుండా ఆ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. విషయం పోలీసుల వరకు చేరడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు అటవీ అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు.