అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..

అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి... 9వ రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచే సభ వ్యవహారాలకు అడ్డుపడ్డారు టీడీపీ సభ్యులు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు అడ్డుపడుతున్నారంటూ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పెండ్ చేశారు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. సభను అడ్డుకుంటున్నారంటూ టీడీపీకి చెందిన అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, రామానాయుడును ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా సభలోనే ఉండిపోయిన ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకి తీసుకెళ్లారు.