ఒకే సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు 

ఒకే సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు 

మన తెలుగులో మల్టీ స్టారర్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. స్టార్ హీరోలు కూడా ఇలాంటి జోనర్ సినిమాలను చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పుడు తాజాగా యువ హీరోలైన నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణులు కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారు. హీరోయిన్ శ్రీయ శరన్ కీలక పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇదివరకే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో రేపే లాంఛనంగా ప్రారంభం కానుంది. నూతన దర్శకుడు ఇంద్రసేనా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కల్ట్ ఈజ్ రైజింగ్ అనే ట్యాగ్ లైన్ తో ఈ ప్రాజెక్టును ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బాబా క్రియేషన్స్ పై అప్పారావు నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.