డివైడ్ టాక్ లోను.. రికార్డు సాధించింది..!!

డివైడ్ టాక్ లోను.. రికార్డు సాధించింది..!!

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమా నవంబర్ 8 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దాదాపు రూ.250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రిలీజ్ కాలేదని ప్రచారం జరగడంతో పాటు హాలీవుడ్ కు చెందిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేయడంతో.. సినిమా ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురుచూశారు.  రిలీజైన మొదటి షోకే డివైడ్ టాక్ వచ్చింది. 

ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో భారీ ప్లాప్ సినిమా అని కొందరు ట్విట్టర్లో ట్రోల్ చేశారు.  కథ అస్సలు బాగాలేదని.. గ్రాఫిక్ వర్క్స్ కూడా నాసిరకంగా ఉన్నాయని చెప్పడంతో.. సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయా అని అనుకున్నారు.  మొదటిరోజు ఈ సినిమా ఊహించినదానికంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది.  ఒక్కరోజులోనే రూ.50 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.  బాలీవుడ్ లో ఏ సినిమా కూడా ఇంతవరకు మొదటిరోజు 50 కోట్లు కలెక్ట్ చేయలేదు.  

 డివైడ్ టాక్ రావడంతో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాపై ఎఫెక్ట్ పడింది.  రెండు చోట్ల కలిపి మొదటిరోజు కేవలం రూ.1.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది.  మరి రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.