పరీక్ష పాసైన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' !

పరీక్ష పాసైన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' !

అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రిన కైఫ్, ఫాతిమా సనా షేక్ లు కలిసి నటిస్తున్న సినిమా 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'.  విడుదలైన ట్రైలర్ గొప్పగా ఉండటంతో ఈ చిత్రంపైన అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి.  కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా యొక్క సెన్సార్ పనులు ముగిశాయి. 

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.  నవంబర్ 8న దీపావళి కానుకగా చిత్రం విడుదలకానుంది.  సుమారు 300 కోట్ల బడ్జెట్ తో యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేశాడు.  హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడ ఈ చిత్రం 8వ తేదీనే విడుదలకానుంది.