'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' ఎగ్జిబిటర్ల గోల !

 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' ఎగ్జిబిటర్ల గోల !

దీపావళి సందర్బంగా విడుదలైన బాలీవుడ్ చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.  సుమారు 300 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం 140 కోట్లు మాత్రమే వెనక్కి రాబట్టగలిగింది.  దీంతో భారీ మొత్తం వెచ్చించి హక్కుల్ని కొన్న ఎగ్జిబిటర్లు సుమారు 50 నుండి 60 శాతం నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. 

కేవలం కమీషన్ పద్దతిలో డిస్ట్రిబ్యూట్ చేసిన యాష్ రాజ్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కొంతవరకు లాభాలని అందుకున్నారు.  ఇంత ఎక్కువ మొత్తంలో నష్టపోవడంతో ఎగ్జిబిటర్లు ఆ నష్టాన్ని పూరించాలని నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ ను డిమాండ్ చేస్తున్నారు.  మరి వీరి బాధను నిర్మాతలు పట్టించుకుంటారో లేదో చూడాలి.