'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' ఓపెనింగ్స్ ఎంత ఉండొచ్చు !

'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' ఓపెనింగ్స్ ఎంత ఉండొచ్చు !

ఈ ఏడాది విడుదలకానున్న భారీ చిత్రాల్లో 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' కూడ ఒకటి.  అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ లు కలిసి నటించడం వలన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.. నవంబర్ 8వ తేదీన ఈ సినిమా భారీ ఎత్తున విడుదలకానుంది.  దీంతో ఓపెనింగ్స్ కూడ అదే స్థాయిలో ఉండనున్నాయి. 

ఇండియాలోనే ఈ సినిమా మొదటిరోజు ఓపెనింగ్స్ 45 కోట్లు ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  మరి ఇండియాలోనే ఇంతలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ఉండనున్నాయి.  విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్ర నిర్మించారు.