ఇండియాలో పోయింది.. అక్కడైనా ఆడుతుందా ?

ఇండియాలో పోయింది.. అక్కడైనా ఆడుతుందా ?

హెవీ బడ్జెట్ తో రూపొంది భారీ అంచనాల నడుమ రిలీజైన హిందీ చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.  అమితాబ్, అమీర్ ఖాన్ కలిసి నటించిన ఈ చిత్రం 'బాహుబలి' రికార్డుల్ని తాకుతుందని అందరూ అనుకుంటే చిత్రం రిలీజైన అన్ని భాషల్లోనూ చతికిలబడింది.  ఎగ్జిబిటర్లు కూడ ఎక్కువ మొత్తంలో నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది.  ఇక ఈ సినిమాను చైనాలో డిసెంబర్ 28న పెద్ద ఎత్తున విడుదలచేస్తున్నారు.  మరి ఇండియన్ సినిమాలకు మంచి గిరాకీ ఉన్న చైనాలో అయినా ఈ చిత్రం హిట్టవుతుందేమో చూడాలి.