రివ్యూ : థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ 

రివ్యూ : థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ 

నటీనటులు: అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా తదితరులు 

సంగీతం : అజయ్, అతుల్ 

ఫోటోగ్రఫి : మానుశ్ నందన్ 

నిర్మాణ సంస్థ : యశ్ రాజ్ ఫిల్మ్స్ 

దర్శకత్వం : విజయ్ కృష్ణ ఆచార్య 

ఇటీవల కాలంలో బాలీవుడ్ భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.  అలాంటి వాటిల్లో ఒకటి థగ్స్ ఆఫ్ హిందూస్తాన్.  ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు సంవత్సరం కాలంగా ఎదురు చూస్తున్నారు.  మరి వారి ఎదురు చూపులు ఎంతవరకు ఫలించాయో ఇప్పుడు చూద్దాం.  

కథ  :

భారతదేశాన్ని బ్రిటిష్ పాలకులు పాలించే కాలంలో దారి దోపిడీ దొంగలు ఎక్కువగా ఉండేవారు.  సముద్రంలో ఎక్కువ దోపిడీలు చేస్తుంటారు.  వారి వలన అనేక మంది ఇబ్బందులు పడుతుంటారు.  ఆ దొంగలు బ్రిటిష్ ఖజానాపై కన్నువేయడంతో.. బ్రిటీష్ పాలకులు వారిని అంతమొందించడానికి ప్రత్యేక అధికారిని నియమిస్తుంది.  ఆ అధికారి దోపిడీ దొంగలను పెట్టుకున్నారా లేదా..? అన్నది మిగతా కథ.  

విశ్లేషణ : 

ఇలాంటి కథలు పుస్తకాల్లో చదువుతున్నప్పుడు గూస్ బమ్స్ వస్తుంటాయి.  తెరపై చూస్తే ఇంకెలా ఉంటుంది. మామూలు సినిమాల్లా తెరకెక్కించడం అసాధ్యం.  సీజీఐ వర్క్స్ ఎక్కువగా ఉంటుంది.  టెక్నాలజీని నమ్ముకొని సినిమాను తెరకెక్కించారు.  ఇలాంటి సినిమాలు ఇండియాలో ఇంతవరకు రాలేదు అన్నది వాస్తవం.  కన్ఫెషన్ ఆఫ్ ది థగ్ అనే నవల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు.  ఫస్ట్ హాఫ్ అంటా యాక్షన్ తో నిండిపోతుంది.  యాక్షన్ అడ్వెంచర్ అంటే ఇష్టపడేవారికి ఇది కనెక్ట్ అవుతుంది.  సెకండ్ హాఫ్ మాత్రం చప్పగా ఉంటూ.. బోర్ కొట్టిస్తుంది.  ట్విస్ట్ లు ఉన్నప్పటికీ అవి సినిమాను ఉత్కంఠభరితంగా ముందుకు నడిపించలేపోయాయి.  లాజిక్ లు లేకపోవడం మరో మైనస్ అనిచెప్పొచ్చు.  

నటీనటుల పనితీరు : 

అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ల నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  ఇందులో ఇంకా బాగా నటించారు.  అంత వయసులోను అమితాబ్ యాక్షన్ సీన్స్ తో మెప్పించారు.  కత్రినా మరోసారి సయ్యా అంటూ అలరించింది.  యాక్షన్ తరువాత అందరికి నచ్చేది కత్రినా డ్యాన్స్.  ఆమె డ్యాన్స్ కు అందరు తప్పకుండా ఫిదా అవుతారు.  సనా ఫాతిమా నటనతో మరోమారు మెప్పించింది.  

సాంకేతికం :

ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందుతుండటంతో  సినిమా రంగంలో కూడా దీనిని విరివిగా వినియోగిస్తున్నారు.  హాలీవుడ్ సినిమాల రేంజ్ లో మన సినిమాలు కూడా ఉండాలని.. టెక్నాలజీ ఉపయోగించి సినిమాలు నిర్మిస్తున్నారు.  బాలీవుడ్ లోను ఆ టెక్నాలజీని బేస్ చేసుకొని సినిమాలు నిర్మిస్తున్నారు.  ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని వచ్చిన సినిమా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్.  టెక్నాలజీ పరంగా సినిమా ఆకట్టుకుంది.  సీజీఐ వర్క్స్, సెట్స్ అన్ని బాగున్నాయి.  యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.  దర్శకుడు యాక్షన్ సీన్స్ పై తీసుకున్న శ్రద్ద.. ఎమోషన్స్ విషయంలో కూడా తీసుకొని చిన్న చిన్న లాజిక్కులు మిస్ కాకుండా చూసుకొని ఉంటె సినిమా మరో రేంజ్ లో ఉండేది.  

పాజిటివ్ పాయింట్స్ : 

కథ 

సీజి వర్క్స్ 

కత్రినా డ్యాన్స్ 

ఫాతిమా  విన్యాసాలు 

నెగెటివ్ పాయింట్స్ : 

డైరెక్షన్ 

కథనాలు 

సెకండ్ హాఫ్ 

లాజిక్ లేని సన్నివేశాలు 

చివరిగా : మెప్పించని థగ్స్