థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ తెలుగు, తమిళ్ వెర్షన్స్ రెడీ..!!

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్  తెలుగు, తమిళ్ వెర్షన్స్ రెడీ..!!

బాలీవుడ్ లో మోస్ట్ అవైటింగ్ మూవీలలో థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ కూడా ఒకటి.  ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 8 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.  ఒక్క హిందీలోనే కాకుండా.. ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  దక్షిణాది భాషలైన తమిళ, తెలుగు భాషలపైనా కూడా దృష్టిపెట్టారు.  

ఈ రెండు భాషల్లో భారీ  ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. తెలుగు,  తమిళ వెర్షన్ కు సంబంధిన ప్రమోషన్స్ ను అమితాబ్, అమీర్ ఖాన్ లు ట్విట్టర్ ద్వారా ప్రారంభించారు.  దీపావళికి థియేటర్స్ లో బందిపోట్లు దాడి చేస్తారని అంటున్నారు.  అమిర్ ఖాన్ ధూమ్ 3 సినిమా తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నది.  ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందో చూడాలి.