బందిపోట్లకు అడ్డాగా మారుతున్న దేవదాస్ సినిమా..!!

బందిపోట్లకు అడ్డాగా మారుతున్న దేవదాస్ సినిమా..!!

దేవదాస్ సినిమా ఈనెల 27 వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నది. ఇప్పటికే ఈ సినిమా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకోవడంతో.. ఈ సినిమాపై ఇప్పుడు బాలీవుడ్ పరిశ్రమ దృష్టి పెట్టింది.  అంటే దీనిని బాలీవుడ్ లోకి రీమేక్ చేస్తున్నారా లేదంటే బాలీవుడ్ హక్కులను ఏదైనా పెద్ద సంస్థ తీసుకుంటుందా అని అర్ధం చేసుకోకండి..

దేవదాస్ సినిమా రిలీజ్ రోజున బాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ సినిమా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు.  ఈ ట్రైలర్ ను దేవదాస్ సినిమా థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారట.  యశ్ చోప్రా బర్త్ డే సందర్భంగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారట.  ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడనటువంటి విజువన్ గ్రాండియర్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తున్నది.  యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ దీనికోసం భారీగా ఖర్చు చేస్తున్నదట.  బాహుబలిని మించిపోయేలా సినిమా ఉంటుందని అంటున్నారు.  దీనికి తగ్గట్టుగానే థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ కు సంబంధించిన అమితాబ్, కత్రినా, సనా షేక్, ఆమిర్ ఖాన్ లుక్స్ ఉన్నాయి.  కన్ఫెషన్ అఫ్ ఏ థగ్ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది.  కేవలం హిందీకి సంబంధించిన ట్రైలర్ ను మాత్రమే ప్రదర్శిస్తారా లేదంటే తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారా అన్నది తెలియాలి.  అమిర్ ఖాన్ ధూమ్ 3 తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  బాలీవుడ్ చిత్రాలకు టాలీవుడ్ ఒక పెద్ద మార్కెట్ గా నేపథ్యంలో థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ను తెలుగులో డబ్ చేస్తున్నారా లేదా అన్నది తెలియాలి.