ఈ రెచ్చగొట్టడం ఏమిటి వర్మ ?

ఈ రెచ్చగొట్టడం ఏమిటి వర్మ ?

వర్మ.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్.  ఏది చేసినా సంచలనమే.  'లక్ష్మీస్ ఎన్టీఆర్' అంటూ ఇన్నిరోజులు హడావుడి చేసిన ఆయన ఇప్పుడు కేసీఆర్ బయోపిక్ తీస్తానంటూ లేచారు.  సినిమాకు 'టైగర్ కేసీఆర్' అనే పేరు కూడా పెట్టారు.  అంతేనా ఒక వీడియోను రిలీజ్ చేశారు.  అందులో 'మా భాష మీద నవ్వినవ్, ముఖాలు మీద ఊసినవ్, మా బాడీల మీద నడిసినవ్ ఆంధ్రుడా, వస్తున్నా.. వస్తున్నా.. నీ తాట తీయనీకి వస్తున్న' అంటూ పాట కూడా పాడేశారు. 

ఇది చూసిన నెటిజన్లు ఇలా సినిమా పేరుతో ఒక ప్రాంతం వారిని రెచ్చగొట్టడం సరికాదని అంటుంటే ఇంకొందరు మాత్రం ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు.  రెస్పాన్స్ చూసిన వర్మ ఇదే సినిమా ఫస్ట్ లుక్ అని, సినిమా ఉద్దేశ్యాన్ని ఈ వీడియో కంటే ఏదీ స్పష్టంగా చెప్పలేదని అన్నారు.  మరి ఫస్ట్ లుక్కే ఇలా వదిలిన వర్మ సినిమాను ఇంకెంత ఘాటుగా తీస్తారో చూడాలి.