పులి గోర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

పులి గోర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం మొసల్ల మడుగు వద్ద చంపిన పులికి సంబంధించి పులి గోర్లను సమీప అటవీ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివ్వారం అడవి ప్రాంతంలో శుక్రవారం పులి అవశేషాలు లభించిన విషయం తెలిసిందే. అవశేషాలు లభించిన స్థలం నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని చెట్ల పొదల్లో పులి గోర్లను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.