"హీరోపంతి-2" సెట్స్ లో టైగర్ ష్రాఫ్ పిక్ లీక్

"హీరోపంతి-2" సెట్స్ లో టైగర్ ష్రాఫ్ పిక్ లీక్

బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ నటిస్తున్న తాజా చిత్రం "హీరోపంతి-2". 2014లో విడుదలైన 'హీరోపంతి' చిత్రంతో టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా 'హీరోపంతి-2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెట్స్ నుంచి లీకైన పిక్ ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరో బ్లాక్ సూట్, సన్ గ్లాసెస్ ధరించి చిత్రబృందంతో కలిసి నడుస్తున్నాడు. మరోవైపు 'హీరోపంతి-2' మొదటి షెడ్యూల్ ను కరోనా బారిన పడకుండా విజయవంతంగా ముగించారు టీం. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'హీరోపంతి'ని సాజిద్ నడియావాలా నిర్మించగా, 'హీరోపంతి-2'ను అహ్మద్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగంలో నటించిన తార సుతారియా సీక్వెల్ లో కూడా లీడ్ రోల్ పోషిస్తోంది. ఇదివరకే 'హీరోపంతి-2' నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. భారీ యాక్షన్ థ్రిల్లర్ 'హీరోపంతి' విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టైగర్ అభిమానులు.