సెల్ మింగేసిన ఖైదీ....ఆపరేషన్ చేసి !

సెల్ మింగేసిన ఖైదీ....ఆపరేషన్ చేసి !

 

జైళ్ళలోపలికి మొబైల్ ఫోన్ స్మగ్లింగ్ చేయడం వాటిని వినియోగించడం షరా మామూలే. అయితే సస్పెన్స్ చెకింగ్ లు, రైడ్ లు చేసి వాటిని స్వాధీనం చేసుకోవడం కూడా పోలీసులకి కూడా మామూలే. కానీ తీహార్ జైలులో ఉన్న ఖైదీ కడుపు నుండి ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వింతగా ఉన్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే తీహార్ జైలు లోపల జైలు నెంబర్ 4లోని ఖైదీ ఒకే సారి నాలుగు చిన్న చిన్న చైనా ఫోనులు మింగి లోపలి రావడానికి ప్రయత్నించాడు. అయితే అది కనిపెట్టిన పోలీసులు డాక్టర్ ఇచ్చిన మందులు ఇచ్చి అవి బయటకు వచ్చేలా చేశారు. అయితే నాలుగు ఫోన్లు మింగితే మూడే బయటకి వచ్చాయి. హమ్మయ్య నాలుగోది లోపలే ఉంది కదా అని అతను సైలెంట్ గా ఉండిపోయాడు. అయితే అది అతనికి నొప్పి కలగడంతో మళ్ళీ పోలీసులకి ఫిర్యాదు చేయగా ఆయనకు సర్జరీ చేసి ఆ ఫోన్ తీయాల్సి వచ్చింది.