టిక్ టాక్ కొత్త ఎత్తులు... ఆంక్షల నుంచి బయటపడేందుకు... 

టిక్ టాక్ కొత్త ఎత్తులు... ఆంక్షల నుంచి బయటపడేందుకు... 

గాల్వాన్ ఘటన తరువాత ఇండియాలో చైనాకు సంబంధించిన 59 యాప్ లపై నిషేధం విధించిన  సంగతి తెలిసిందే.  ఇందులో టిక్ టాక్, హలో యాప్ లు కూడా ఉన్నాయి.  టిక్ టాక్ యాప్ బ్యాన్ తరువాత దాని మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  

అమెరికాలో కూడా టిక్ టాక్ పై నిషేధం విధించే అవకాశం ఉన్నట్టుగా తెలియడంతో బైట్ డ్యాన్స్ సంస్థ చైనా నుంచి తన కంపెనీని తరలించాలని చూస్తోంది.  లండన్ లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించాలని చూస్తోంది.  చైనా నుంచి అమెరికాకు షిఫ్ట్ చేస్తే, ఇండియాలో తిరిగి ఈ యాప్ పై నిషేధం ఎత్తేసే అవకాశం ఉంటుంది. అమెరికాలోనూ, లండన్ లోనూ ఈ సంస్థ అధిక సంఖ్యలో రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.