భారత్ లో టిక్ టాక్ పై నిషేధం, యాప్ తొలగించాలని గూగుల్, యాపిల్ లకు నోటీస్

భారత్ లో టిక్ టాక్ పై నిషేధం, యాప్ తొలగించాలని గూగుల్, యాపిల్ లకు నోటీస్

షార్ట్ వీడియోలు తయారుచేసి షేర్ చేసుకొనే ఎంటర్ టైన్ మెంట్ యాప్ టిక్ టాక్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. తమ అప్లికేషన్స్ స్టోర్ నుంచి టిక్ టాక్ ను తొలగించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గూగుల్, యాపిల్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇది టిక్ టాక్ యాప్ కి పెద్ద దెబ్బేనని భావిస్తున్నారు.

టిక్ టాక్ యాప్ ద్వారా తయారై వైరల్ అవుతున్న వీడియోలు అశ్లీలంగా, అభ్యంతరకరంగా ఉంటున్నాయని మద్రాస్ హైకోర్ట్ కి చెందిన మదురై బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. టిక్ టాక్ యాప్ కంటెంట్ పై ఏప్రిల్ 3న ఒక ఆదేశం కూడా జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈ యాప్ డౌన్ లోడింగ్ పై నిషేధం విధించాల్సిందిగా ఆ ఆదేశాల్లో ప్రభుత్వాన్ని కోరింది. 

'ఇకపై మరింత మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోలేరు. దీనిని ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకున్నవాళ్లు మాత్రం దీనిని ఉపయోగించగలరు. ప్రభుత్వం గూగుల్, యాపిల్ లకు తమ యాప్ స్టోర్ల నుంచి ఈ యాప్ ను డిలిట్ చేయాల్సిందిగా సూచించింది. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తాయా లేదా దీనిని కోర్టులో సవాల్ చేస్తాయా అనేది కంపెనీలపై ఆధారపడి ఉంటుందని' ఎకనామిక్ టైమ్స్ వార్తాపత్రిక తన కథనంలో తెలిపింది.

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఒక 19 ఏళ్ల బాలుడి హత్య జరిగింది. ఆ సమయంలో అతని స్నేహితులు టిక్ టాక్ యాప్ లో ఈ సంఘటన వీడియోని షూట్ చేస్తున్నారు. దీంతో టిక్ టాక్ యాప్ పై వివాదాల మబ్బు మసకేసింది. ఇదే కాకుండా యాప్ లో విభిన్న రకాల అసహ్యకరమైన, అశ్లీల కంటెంట్ పెడుతున్నారని తరచుగా అభ్యంతరాలు వ్యక్తమవుతూ వచ్చాయి. 

టిక్ టాక్ ని చైనాలో డావుయిన్ అని పిలుస్తారు. ఇది ఒక తరహా మీడియా యాప్. దీనిలో యూజర్లు చిన్న చిన్న ఆహ్లాదకరమైన వీడియోలు చేసి షేర్ చేస్తుంటారు. ఈ యాప్ ని బాయిట్ డాన్స్ కంపెనీ తయారుచేసింది. డావుయిన్ పేరుతో దీనిని 2016లో చైనాలో లాంచ్ చేశారు. ఆ తర్వాత ఏడాది దీనిని విదేశీ మార్కెట్లలో ప్రవేశపెట్టారు.