ట్రంప్‌ను లెక్కచేయని టిక్‌టాక్‌.. తాజా నిర్ణయం ఇదే..!

ట్రంప్‌ను లెక్కచేయని టిక్‌టాక్‌.. తాజా నిర్ణయం ఇదే..!

భారత్‌లో చైనా యాప్‌పై నిషేధం విధించిన తర్వాత.. పలు దేశాలు అదేబాట పట్టాయి... ముఖ్యంగా అంతా టిక్‌టాక్‌ను టార్గెట్ చేశారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అయితే.. టిక్‌టాక్‌కు డెడ్‌లైన్ పెట్టారు.. అమెరికాలోని టిక్‌టాక్‌ కార్యకలాపాలు ఏదైనా తమ దేశానికి చెందిన సంస్థకే అప్పగించాలి.. లేదా.. నిషేధం తప్పదని హెచ్చరిస్తూ వస్తున్నారు ట్రప్.. అయితే, అమెరికాలో టిక్‌టాక్‌ కార్యకలాపాలను అమ్మడం కంటే మూసేయడమే మేలనుకుంటోంది దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్.! అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలపై ఆ సంస్థ ఈ నెల 15లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రంప్‌ బెదిరింపులకు భయపడి టిక్‌టాక్‌ను అమ్మితే అమెరికా ఒత్తిడికి తలొగ్గినట్లవుతుందని చైనా భావిస్తోంది. అందుకే టిక్‌టాక్‌ను అమ్మడం కంటే మూసేయడమే మేలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. అయితే చైనా ప్రభుత్వం తమకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదని బైట్‌డ్యాన్స్ వెల్లడించింది.