మళ్లీ నోటికి పని చెప్పిన ఆసీస్ కెప్టెన్

మళ్లీ నోటికి పని చెప్పిన ఆసీస్ కెప్టెన్

ఆసీస్ క్రికెటర్లకు స్లెట్జింగ్ అంటే వెన్నతో పెట్టిన విద్య. మైదానంలో ఆటగాళ్ల ఏకగ్రతను దెబ్బతీసేలా నోటికి పనిచెబుతుంటారు. ఇక టీమిండియాతో సిరీస్ అంటే మరింత రెచ్చిపోతారు. మెల్ బోర్న్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మను టీజ్ చేసిన ఆసీస్ కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్.. రెండో ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ ను టీజ్ చేశాడు. ఆసీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో జట్టులో చోటు కోల్పోయిన రిషబ్ ను ఉద్దేశించి.. 'ధోనీ జట్టులోకి వచ్చేశాడు. ఇక నీకు చాలా ఖాళీ. ఇంతకీ నీకు పిల్లల్ని చూసుకోవడం వచ్చా? నేను నా భార్యను తీసుకుని సినిమాకు వెళ్తా. నువ్వు మా పిల్లల్ని కాస్తా చూసుకోగలవా?’ అంటూ వికెట్ల వెనుక కీపింగ్ చేస్తూ రిషబ్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అతడి మాటలను రిషబ్ పంత్ అసలు పట్టించుకోలేదు. 

మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేస్తుండగా 'నువ్వు సిక్స్ కొడితే.. నేను ముంబయికి మారిపోతా'.. అంటూ పైన్ కవ్వించే యత్నం చేశాడు‌. రోహిత్  ఏకాగ్రతను దెబ్బతీసేందుకు టిమ్ పైన్ వికెట్ల వెనకాల నుంచి ప్రయత్నించాడు.