టైమ్ మ్యాగజైన్ పై మళ్లీ మోడీ.. కానీ..

టైమ్ మ్యాగజైన్ పై మళ్లీ మోడీ.. కానీ..

ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ కవర్ పేజీపై ప్రధాని మోడీ మళ్లీ దర్శనమిచ్చారు. కవర్ పేజీపై వ్యంగ్యంగా ఉన్న మోడీ ఫొటో పక్కన భారతదేశాన్ని విభజించేవాడు అనే హెడ్ లైన్ ఉంది. మరో ఐదు సంవత్సరాల పాటు మోడీ ప్రభుత్వాన్ని భారత ప్రజలు విశ్వసించగలరా అని ప్రశ్నించింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో గతంలో కంటే ఎక్కువగా విభజింపబడిందని అన్న హెడ్ లైన్ తో ఈ ఆర్టికల్ ను అతిష్ తఫీర్ రాశారు. నెహ్రూ,మోడీకి మధ్య వ్యత్యాసం గురించి కూడా ఈ ఆర్టికల్ లో ప్రచురించింది. మోడీ హయాంలో హిందూ-ముస్లిం సంబంధాలు, మోడీని తిట్టడం ద్వారా హిందూ అనుకూలమైన వ్యక్తులుగా నిరూపించుకోవడం వంటి ఆధారంగా ఈ ఆర్టికల్ లో పేర్కొన్నారు. 2017 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగీ ఆదిత్యనాథ్ నియామకం దగ్గర నుంచి మాలేగావ్‌ పేలుడు కేసులో నిందితురాలు, బీజేపీ భోపాల్‌ లోక్‌సభ స్థానం అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ టికెట్ కేటాయించడం వ్యవహారాలను కూడా ప్రస్తావించింది. ఏటీఎస్ అధికారి హేమంత్ క‌ర్కరే త‌న శాపం వ‌ల్లే ఉగ్రవాదుల చేతుల్లో మ‌ర‌ణించిన‌ట్లు ప్రజ్ఞా వ్యాఖ్యలను ప్రధాని మోడీ సమర్ధించిన విష‌యం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై కూడా విమర్శలు చేసింది. వారి కూటమి బలహీనంగా ఉందని టైమ్స్ తన కథనంలో పేర్కొంది. కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాలను నడుపుతోందని తెలిపింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్న తరుణంలో ఈ కథనాన్ని ప్రచురించింది. మరో రెండు దశల పోలింగ్ అనంతరం దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. అనంతరం మే 23న ఫలితాలు రానున్నాయి. మే 20, 2019న విడుదల అయ్యే ఈ మ్యాగజైన్ ప్రస్థుతం దేశం లో ఎన్నికలు జరుగుతన్న సమయంలో వివాదాలు సృష్టించేదిగా ఉంది.