కొరటాల, చిరు సినిమాకు ముహూర్తం కుదిరింది !

కొరటాల, చిరు సినిమాకు ముహూర్తం కుదిరింది !

ఆరంభం నుండి స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వరుసగా నాలుగు హిట్లందుకున్న దర్శకుడు కొరటాల శివ తన తర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నాడని ఎన్నో రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.  

తాజాగా ఫిలిం నగర్లో వినిపిస్తున్న వార్తల మేరకు ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో మొదలవుతుందని తెలుస్తోంది.  అప్పటికి చిరు 'సైరా' పనుల్ని పూర్తిచేసి ఉంటారు కాబట్టి కొరటాల తన సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నారట.  ఈ చిత్రం కూడా కొరటాల యొక్క అన్ని సినిమాల్లాగే కొంత సామాజిక సందేశాన్ని కలిగి ఉంటుందట.