శ్రీవారి లడ్డూ ప్రసాదం...వెనక్కి తగ్గిన టీటీడీ

శ్రీవారి లడ్డూ ప్రసాదం...వెనక్కి తగ్గిన టీటీడీ

శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలు పెంచడం లేదన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. లడ్డూ ధరలు పెంచకూడదని నిర్ణయించామని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలు టీటీడీ తీసుకోదని తెలిపారాయన.  నేడు తమిళనాడులో పర్యటిస్తున్న ఆయన, చెన్నైలో మీడియాతో మాట్లాడారు. లడ్డూ ధరను సవరించడం లేదని, ప్రస్తుతం కొనసాగుతున్న విధానంలోనే లడ్డూల విక్రయాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.  చెన్నైలో శ్రీవారి ఆలయానికి తమిళనాడు ప్రభుత్వం స్థలం కేటాయించింది టీటీడీ.  ఆగమశాస్త్రాల అనుగుణంగా ఆలయ నిర్మాణానికి.. అనుకూలమా లేదా అనే విషయం త్వరలో నిర్ణయిస్తామన్నారు. అతిథి గృహాల అద్దెపెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు వైవీ. గత వారంలో టీటీడీ అధికారులు సమావేశమై, ప్రస్తుతం రూ. 25గా ఉన్న లడ్డూ ధరను రూ. 50కి పెంచాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ధర పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.