తిరుమలలో మోసాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

తిరుమలలో మోసాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ టూరిజం ద్వారా తిరుమలకు వచ్చే భక్తుల ఫోన్ నంబర్లను ట్రాప్ చేసి వారికి దర్శనం చేయిస్తానని కార్తీక్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. దీనిపై తిరుమల విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన తిరుమల టూటౌన్ పోలీసులు తెనాలిలో కార్తీక్ ను అదుపులోకి తీసుకున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన కార్తీక్ తిరుమలకు వచ్చి కొంత మందితో సంబంధాలు ఏర్పాటు చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. కార్తీక్‌తో సంబంధం కలిగిన తిరుమలలోని లడ్డు దళారులు, మఠంలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని టూటౌన్ పోలీసులు తెలిపారు.