బంగారం వివాదంపై టీటీడీ ఈవో క్లారిటీ..

బంగారం వివాదంపై టీటీడీ ఈవో క్లారిటీ..

ఎన్నికల సమయంలో టీటీడీకి చెందిన బంగారం ఎన్నికల అధికారులకు పట్టుబట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో ఎందుకు తరలించారు. అనే ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌.. టీటీడీకి సంబంధించిన బంగారాన్ని ఎలా తరలిస్తారు? ఏ వాహనంలో తీసుకొస్తారు? వంటి వివరాలతో తమకు సంబంధం లేదని, పూర్తి బాధ్యత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌దేనని స్పష్టం చేశారు. గోల్డ్‌ డిపాజిట్‌ స్కీం 2000 ఏప్రిల్‌ 1న ప్రారంభమైంది. ఎస్‌బీఐలో 5,387 కిలోల బంగారం ఉంది. పీపీఎన్‌బీలో 1381 కిలోల బంగారం ఉంది. టీటీడీకి సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉంది. 2016 ఏప్రిల్‌లో పీఎన్‌బీలో 1381 కిలోల బంగారం వేశాం. అది 2019 ఏప్రిల్‌ 18కి మెచ్యురిటీ అయ్యింది. మెచ్యురిటీ అంశంపై మార్చి 27నే పీఎన్‌బీకి లేఖ రాశాం. బంగారం తరలింపు అంశం పూర్తి బాధ్యత పీఎన్‌బీదే. పీఎన్‌బీ వచ్చి ట్రెజరీలో ఇస్తే అది టీటీడీది అవుతుందన్నారు. 

ఎన్నికల కమిషన్ సీజ్‌ చేసేటప్పుడు డాక్యుమెంట్లు ఉన్నాయని పీఎన్‌బీ మాతో చెప్పిందన్నారు టీటీడీ ఈవో... ఈసీ అధికారులకు డాక్యుమెంట్లు చూపామని ఫోన్‌లో చెప్పారు. వాళ్లు ఈసీకి ఎలాంటి డాక్యుమెంట్లు చూపారో మాకు తెలియదు. మేం మార్చి 27న లేఖ రాసేటప్పుడు ఏప్రిల్‌ 18న రావాలని చెప్పాం. ఏప్రిల్‌ 18కి బదులు ఏప్రిల్‌ 20న బంగారం అందజేశారు. బంగారం ఎలా తరలిస్తారో.. ఏ వాహనంలో తీసుకొస్తారో మనకెలా తెలుస్తుంది. బంగారం మాకు వచ్చేంత వరకు మిగిలిన విషయాలు అవసరం లేదు. బంగారం ఎలా వస్తే మాకేంటి? మాకు బంగారం అందిందా లేదా అనేది ముఖ్యం అన్నారు