తిరుపతిలో బాలికపై అత్యాచారం.. లిఫ్ట్ ఇచ్చి గ్యాంగ్ రేప్..!

తిరుపతిలో బాలికపై అత్యాచారం.. లిఫ్ట్ ఇచ్చి గ్యాంగ్ రేప్..!

దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపేసినా అత్యాచారాల పరంపర మాత్రం ఆగడంలేదు... తిరుపతిలో తాజాగా మరో ఘటన జరిగింది.. తిరుపతి సమీపంలోని ముళ్లపూడిలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. లిఫ్ట్ ఇస్తామంటూ నమ్మబలికి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన పోలీసులు.. పద్మావతిపురం దగ్గర తిరుచానూరు వైపు వెళ్తున్న ఓ బైక్‌ను లిఫ్ట్ కావాలని అడిగింది బాలిక.. తనను తిరుచానూరులో విడిచిపెట్టాలని కోరింది. అయితే, ఆ యువకుడు తిరుచానూరులో బైక్‌ను ఆపకుండా ముళ్లపూడి గేట్ వరకు తీసుకెళ్లాడు.. బైక్‌లో పెట్రోల్ అయిపోయిందంటూ పక్కనే ఆపేసి.. తన మిత్రుడికి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు.. ఆ తర్వాత పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకొల్లి ఇద్దరూ బాలికిపై అత్యాచారానికి పాల్పడ్డారు.. బాధిత బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశాం.. నిందితుల్లో ఒకరపై గతంలో కేసులు ఉన్నాయని తెలిపారు.