సీఎం కాన్వాయ్ ను అడ్డుకున్న గ్రామస్థులు

 సీఎం కాన్వాయ్ ను అడ్డుకున్న గ్రామస్థులు

టిట్లీ తుపాను ప్రభావ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను కవిటి గ్రామంలోని మత్స్యకారులు అడ్డుకున్నారు. తమ గ్రామం నుంచి వెళ్తూ తమ బాగోగులు పట్టించుకోకుండా వెళ్తున్న సీఎంపై తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్‌కి అడ్డుతగిలి తమ గోడును వెళ్లగక్కారు. మూడు రోజులుగా తిండీ తిప్పలు లేకుండా అంధకారంలో ఉన్నామనీ, ప్రభుత్వం చెప్తున్నట్టుగా తమకు ఎలాంటి సహాయం అందలేదని సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు టిట్లీ బాధితుల సహాయార్ధం అన్ని సహాయక చర్యలు చేపట్టామనీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి అడ్డుతగలడం భావ్యం కాదని అన్నారు. కాగా, తుఫాను సహాయక చర్యల్లో సక్రమంగా పనిచేయడంలేదని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో సీఎం చంద్రబాబు కవిటి మండల అభివృద్ధి అధికారిని సస్పెండ్ చేశారు.