హైవే ప్రమాదాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి..

హైవే ప్రమాదాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి..

తెలంగాణలోని కొత్లపూర్ ఎక్స్ రోడ్ లో ప్రొఫెసర్ కోదండరాం ఈరోజు టీజేఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరీంనగర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 10లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైవేలపై తరచూ జరిగే ప్రమాదాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరారు. 

సంగారెడ్డి జిల్లాలోని కొత్లపూర్ లో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం.. రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఉన్న రికార్డులను కూడా తప్పుడుగా మార్చి వేసిందని వెల్లడించారు. రికార్డులు సరి చేయమని రైతు దరఖాస్తు పెట్టిన వారం రోజుల్లో సరి చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోదండరాం కోరారు.