జనగాం నుంచి కోదండరాం పోటీ?

జనగాం నుంచి కోదండరాం పోటీ?

టీజేఎస్‌ పార్టీ అధ్యక్షుడు కోదండరాం జనగాం నుంచి బరిలోకి దిగుతున్నాడని తెలుస్తోంది. జనగాంలో ఇప్పటికే కోదండరాం పేరిట ప్రచార రథాలు సిద్ధమయ్యాయట. బీసీ సీటులో పోటీచేస్తే తనకు అపవాదు వస్తుందని చెప్పిన కోదండరాం.. ఇప్పుడు పోటీకి సిద్ధం కావడంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. మరోవైపు జనగాం టికెట్ కోసం కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పొన్నాల జనగాం టికెట్ కోసం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తీవ్ర చర్చలు చేస్తున్నారు. ఒకవైపు కోదండరాం అక్కడ పోటీకి సిద్ధమవుతున్నారు.. మరోవైపు పొన్నాల కూడా జనగాం టికెట్ తనదే అని చెపుతున్నాడు. ఈ నేపథ్యంలో జనగాం టికెట్ ఎవరికీ వస్తుందో  చర్చనీయాంశంగా మారింది. జనగాంతో పాటు వరంగల్ ఈస్ట్, స్టేషన్‌ఘన్‌పూర్, మిర్యాలగూడ సీట్లపై కూడా చర్చలు జరుగుతున్నాయి.