కుటుంబ పాలనను గద్దె దించుదాం

కుటుంబ పాలనను గద్దె దించుదాం

తెలంగాణాలో కుటుంబ పాలనను గద్దె దించుదాం అని టీజేఎస్ అధినేత కోదండరాం పిలుపునిచ్చారు. బుధవారం ప్రజకూటమి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... మేమంతా ప్రజల కోసం ఉద్యమాలు చేశాం. తెలంగాణ వస్తే ప్రజల భాగస్వామ్యంతో అందరి సంక్షేమం కోసం పని చేస్తోందని నమ్మినం. ప్రభుత్వం తీరు మారుతుంది అనుకున్నాం.. కానీ జైలు పాలు అయ్యాం. తెలంగాణాలో అనుకున్న ఫలితాలు రాలేదు. ఒక కుటుంబ సంక్షేమం కోసం పాలన సాగితే.. రాష్ట్రం బాగుపడదన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చుదాం రండని ప్రజలను  అడుగుతున్నాం అని కోదండరాం తెలిపారు. జయ శంకర్ మాటలే మాకు ఆదర్శం.. తెలంగాణ అభివృద్ధికి పాటుపడతామన్నారు.