ఒక్క సీటు కూడా దక్కించుకోని టీజేఎస్

ఒక్క సీటు కూడా దక్కించుకోని టీజేఎస్

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కనీసం ఒక్క సీటైనా గెలుచుకోలేక పోయింది తెలంగాణ జనసమితి. మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా.. ఒక్క చోట కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు. టీజేఎస్ అభ్యర్థులు 13 చోట్ల బరిలోకి దిగారు. ఆ తర్వాత 5 చోట్ల అభ్యర్థులు ఉపసంహరించుకోగా.. ఎనిమిది స్థానాల్లో టీజేఎస్ పోటీ చేసింది. వీటిలో నాలుగు స్థానాలు దుబ్బాక, వరంగల్‌ తూర్పు, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. 

తెలంగాణ జన సమితి అధ్యక్షుడైన కోదండరామ్ తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని, సీట్ల సర్ధుబాటుపై చాలా సార్లు కూటమి నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీజేఎస్ కు కేటాయించిన స్థానాల్లో ఆ తరువాత కాంగ్రెస్ తమ అభ్యర్ధులను కూడా బరిలోకి దింపింది. దీంతో ఆయన మండిపడ్డారు. సీనియర్ నేతలు కోదండరామ్ ను బుజ్జగించారు.