కూటమిలో ప్రతిష్ఠంభనకు ఆ రెండే ప్రధాన కారణం...

కూటమిలో ప్రతిష్ఠంభనకు ఆ రెండే ప్రధాన కారణం...

తెలంగాణలో మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది... కూటమిలోని పక్షాలు ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుండడంతో కాంగ్రెస్ ఎటూ తేల్చడం లేదు. ఇదే విషయంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం... సాచివేత, తాత్సారమే ప్రస్తుత ప్రతిష్ఠంభనకు ప్రధాన కారణం అంటున్నారు. ఢిల్లీలో ఎన్టీవీతో మాట్లాడిన ఆయన... కూటమిలో భగస్వామ్యపక్షంగా రాహుల్ గాంధీని మాకు మేం పరిచయం చేసుకోవాలని భావిస్తున్నామని... మేం మొత్తం 15 స్థానాలు కావాలని అడుగుతున్నాం... దానిపైనే చర్చిస్తామన్నారు. మధ్యలోనే అధికారాన్ని వదులుకొని పోయిన కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించడం ఖాయమన్న కోదండరాం... మా కూటమి అధికారంలో కి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే అమరవీరులకు స్మారక స్థూపంనిర్మించడం, ఆ కుటుంబాలను గౌరవించుకోవడం మా తొలి కర్తవ్యమని స్పష్టంచేసిన టీజేఎస్ అధ్యక్షుడు... ఆ తర్వాత ఉద్యోగ నియామకాలే మాకు అత్యంత ప్రాధాన్యతాంశం అన్నారు.