పొలిటికల్ బెనిఫిట్ కోసమే .. !

పొలిటికల్ బెనిఫిట్ కోసమే .. !

అగ్రవర్ణాలలో  పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మంచిదే..కానీ సాధ్యం అయ్యే పని కాదంటున్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్.నిర్ణయాన్ని అమలు చేయడమంటే ఇబ్బందేనని వ్యాఖ్యానించారు.రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15, 16లకు సవరణలు చేయాల్సి ఉంటుందని,రాష్ట్రాల ఆమోదం కూడా తప్పనిసరి అని కోదండరామ్ అన్నారు. ఇది అమలు చేయాలన్నా..ఈ మూడు నెలల గడువు సరిపోదన్నారాయన. ఎన్నికల ముందు రాజకీయంగా బెనిఫిట్ పొందే నిర్ణయమని జనసమితి అధ్యక్షుడు కామెంట్ చేశారు.