అధికార పార్టీ కక్షసాధింపు సరికాదు..

అధికార పార్టీ కక్షసాధింపు సరికాదు..

అధికార పార్టీలు ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు సరికాదన్నారు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం... సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... అధికార పార్టీల వేధింపులు సరికావు.. అందులో భాగంగానే మమతా బెనర్జీని కేంద్రం వేధిస్తోందని ఆరోపించారు. ప్రతీ రాజకీయ పార్టీ నిబద్ధతతో పని చేయాలని సూచించిన కోదండరాం.. సీబీఐ, పార్టీలకు అతీతంగా పని చేయాలన్నారు. ఎవరు అధికారంలో ఉన్నారో వారు సీబీఐని వాడుకుంటే నేడు ప్రతిపక్షంలో ఉన్న వారు రేపు అధికారపక్షం అయినప్పుడు వారు కూడా అదే ధోరణి అవలంభిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక గ్రామ గ్రామాన జన సమితి పార్టీని బలోపేతం చేస్తామన్నారు కోదండరాం.. తాము ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై మాతో కలసి వచ్చే పార్టీలను కలుపుకొనిపోతామన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో పోటీపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుపుతున్నామని.. చర్చల తర్వాత పోటీపై ఒక స్పష్టత ఇస్తామన్నారు కోదండరాం.