ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: కోదండరామ్

ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: కోదండరామ్

తెలంగాణా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. నాంపల్లిలోని జనసమితి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, టీజేఎస్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని స్పష్టం చేశారు. ఓట్లు గల్లంతుపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఓట్ల గల్లంతుపై క్షమాపణలు కోరిన విషయం తెలిసిందేనని.. ఓట్ల గల్లంతుపై అనేక మంది కోర్టును కూడా ఆశ్రయించారని.. అయినా న్యాయం  జరగడంలేదన్నారు. ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం, విలువల కోసం నాలుగున్నర సంవత్సరాలు పోరాడామన్నారు. మహాకూటమి అభ్యర్థుల గెలుపు కోసం జనసమితి కార్యకర్తలు ఎంతో శ్రమించారన్నారు.