ప్రధాని మోడీపై ఈసీకి ఫిర్యాదు.. విదేశీ గడ్డపై నుంచి ప్రభావితం చేశారు..!

ప్రధాని మోడీపై ఈసీకి ఫిర్యాదు.. విదేశీ గడ్డపై నుంచి ప్రభావితం చేశారు..!

ఓవైపు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు.. ఇంకో వైపు కరోనా విజృంభణ.. ఈ సమయంలో.. బంగ్లాదేశ్‌లో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో తొలివిడత పోలింగ్ జరుగుతోన్న నేపథ్యంలో ఆయన బంగ్లాదేశ్‌లో పర్యటించడం విమర్శలకు దారితీసింది.. ఇది కూడా ఎన్నికల నియమావళి ఉల్లంఘించడమేనని రాజకీయ పార్టీలో ఆరోపించారు.. అయితే, ప్రధాని మోడీ.. బంగ్లాదేశ్ పర్యటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్నిక సమయంలో బంగ్లాదేశ్‌లో నరేంద్ర మోడీ పర్యటించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని ప్రవర్తన ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు టీఎంసీ నేతలే.. పొరుగు దేశం గడ్డపై నుంచి రాష్ట్ర ఓటర్లు ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపట్టారని.. మీడియా రిపోర్ట్స్ కోట్ చేశారు టీఎంసీ నేతలు.