కరోనా రోగిని బైక్ మీద ఆసుపత్రికి తీసుకెళ్లిన నేత... శభాష్ అంటోన్న ప్రజలు...
కరోనా సోకిన వ్యక్తుల దగ్గరకు వెళ్ళాలి అంటే భయపడిపోతున్నారు. సొంత మనుషులే దగ్గరకు రావడం కష్టంగా మారిన సమయంలో పక్క గ్రామంలో ఉన్న ఓ నాయకుడు, వేరే వారిదగ్గర నుంచి బైక్ తీసుకొని, పీపీఈ కిట్ కొత్తది కొనుక్కొని రోగి ఇంటికి వెళ్లి అతడిని తన బైక్ మీద కూర్చోపెట్టుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ గ్రామం నుంచి ఆసుపత్రి 5 కిలోమీటర్ల దూరం. అయితేనేం ఆ నేత చేసిన సాహసాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని జార్ గ్రామ్ జిల్లాలో జరిగింది.
జార్ గ్రామ్ జిల్లాలోని సిజు గ్రామానికి చెందిన అమర్ బారక్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా జ్వరంతో ఇబ్బందులు పడుతున్నాడు. అంబులెన్స్ కు ఫోన్ చేసినా రాలేదు. సిజు గ్రామం పక్కనే గోపిబల్లర్ పూర్ గ్రామం ఉన్నది. ఆ గ్రామానికి చెందిన లోకల్ నాయకుడు సత్యకామ్ పట్నాయక్ కు విషయం తెలియడంతో వెంటనే బైక్ తీసుకొని వెళ్లి అతడిని ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. ఇప్పుడు ఈ న్యూస్ పశ్చిమ బెంగాల్ లో వైరల్ గామారింది .
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)