దీదీకి మరో దెబ్బ... సుబెందు అధికారి బాటలో మరికొందరు... 

దీదీకి మరో దెబ్బ... సుబెందు అధికారి బాటలో మరికొందరు... 

పశ్చిమ బెంగాల్ లో వలసలు ఆగడం లేదు.  అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి అనేక మంది నేతలు బయటకు వచ్చి బీజేపీలో చేరుతున్నారు. ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యనేత సుబెందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.  ఆ తరువాత అనేకమంది నేతలు బీజేపీలో తీర్ధం పుచ్చుకున్నారు.  ఇప్పుడు తాజాగా మరో నేత బీజేపీ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు.  దోమ్ జూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన రాజీవ్ ఇటీవలే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.  కాగా, ఇప్పుడు అయన ఎమ్మెల్యేపదవికి కూడా రాజీనామా చేశారు.  ఆదివారం రోజున అయన అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు.  అయితే, వచ్చే ఎన్నికల్లో కూడా దోమ్ జూర్ నియోజక వర్గం నుంచే పోటీ చేస్తానని, నియోజక వర్గం ప్రజలకు అందుబాటులోనే ఉంటానని అన్నారు రాజీవ్.