తృణమూల్ కాంగ్రెస్ నేత కాల్చివేత

తృణమూల్ కాంగ్రెస్ నేత కాల్చివేత

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేత సోఫియుల్ హసన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. హమైపూర్ గ్రామ పెద్ద అయిన సఫియుల్.. హరిహర్‌పరకు కారులో వెళ్తుండగా ముర్షీదాబాద్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపేశారు. ఈ హత్య వెనక గల కారణాలు తెలియాల్సి ఉండగా.. ఇది బీజేపీ పనేనని తృణమూల్‌ నేతలు ఆరోపిస్తున్నారు. తృణమూల్‌ నేతలపై ఇటీవల వరుస దాడులు జరుగుతున్నాయి. హుగ్లీ జిల్లాలో ఓ నేతను హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారు. ముర్షీదాబాద్‌లో పార్టీ కార్యకర్తల ఇళ్లపై జరిగిన బాంబు దాడిలో ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు.